టీఎస్పీఎస్సీకి కొత్తగా ఐఏఎస్ అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ అడిషనల్ సెక్రెటరీగా బి.ఎం.సంతోష్‌ను నియమించింది. ఆయనకే ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బాధ్యతలు అప్పగించింది.

2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంతోష్ ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్, స్పెషల్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆయనను టీఎస్పీఎస్సీకీ బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రమే సంతోష్ టీఎస్పీఎస్సీ కొత్త బాధ్యతలు కూడా తీసుకున్నారు.
