టీఎస్పీఎస్సీ (TSPSC) వివిధ పోస్టుల రిక్రూట్మెంట్ కు నిర్వహిస్తున్న పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షల తేదీలను మార్చుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI), అగ్రికల్చర్ ఆఫీసర్ (AO), గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లోని వివిధి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టుల రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.
ముందుగా షెడ్యూలు చేసిన తేదీలను మార్చుతూ.. కొత్త తేదీల వివరాలను ప్రకటించింది. రీషెడ్యూల్ ప్రకారం ఏఎంవీఐ పరీక్ష జూన్ 28న ఉదయం, మధ్యాహ్నం, అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షకు మే 16న, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ పోస్టులకు నిర్వహించే పరీక్ష జులై 18, 19 తేదీల్లో, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నాన్ గెజిటెడ్ పోస్టులకు జులై 20, 21 తేదీల్లో, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మే 19న పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష గతంలో ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించగా కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్‌గా మార్చారు.

Ghyh