తెలంగాణలో గురుకుల జూనియర్ కాలేజీల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఇంగ్లీషు మీడియం – MPC/ BPC/MEC)లో అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 35 తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు మే 06న TSRJC-CET 2023 టెన్ట్ ను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్-2023లో టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు ఇతర వివరాలకు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. లేదా 040-24734899 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.