నిరుద్యోగులకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF) గుడ్ న్యూస్ చెప్పింది. 451 కానిస్టేబుల్ (డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 22 ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు: 183
కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్) పోస్టులు: 268
READ THIS: తెలంగాణ, ఏపీలో భారీగా పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
విద్యార్హతల వివరాలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు టెన్త్ పాసై ఉండాలి. ఇంకా.. హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఉండాలి. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎత్తు 167 సెంటీ మీటర్లు, ఛాతీ కొలత 80 నుంచి 85 సెంటీ మీటర్లు ఉండాలి. అభ్యర్ధుల వయసు 21-27 ఏళ్లు ఉండాలి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://cisfrectt.in/index.php
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.100లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్ధులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక ఉంటుంది.