Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSడిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో జాబ్స్.. భారీగా వేతనం.. అప్లికేషన్ లింక్ ఇదే..

డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో జాబ్స్.. భారీగా వేతనం.. అప్లికేషన్ లింక్ ఇదే..

దేశీయ బీమా రంగ దిగ్గజం అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (LIC Job Notification) విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విభాగంలో ఈ ఖాళీలను (LIC Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 15వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా ప్రకటించింది ఎల్ఐసీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
READ THIS: నిరుద్యోగులకు అలర్ట్.. 14 వేల ఖాళీలకు వచ్చే నెలలోనే నోటిఫికేషన్.. తాజా అప్డేట్స్ ఇవే!

దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్ధులు రూ.85 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ డైరెక్ట్ లింక్: LINK

ఎంపిక ఇలా..
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ ఫిబ్రవరి 17, 20 తేదీల్లో ఉంటుంది. మెయిన్స్‌ ఎగ్జామ్ మార్చి 18న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.53,600- రూ.1,02,090 వేతనంగా చెల్లించనున్నారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!