సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(C TET )-2022 నోటిఫికేషన్ విడుదల అయింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తుంది.
ఈ నెల 31 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31 వ తేదీ నుంచి నవంబర్ 24 వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్ లైన్ టెస్ట్ ను డిసెంబర్, వచ్చే జనవరిలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
C- TET సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఇది రెండు లెవెల్స్ లో జరుగుతుంది. 1 నుంచి 5 తరగతి వరకు టీచింగ్ చెప్పాలనుకునే వారు పేపర్ 1కు హాజరు కావాలి. అదే 6 నుంచి 8వ తరగతులకు వరకు భోదించాలనుకుంటే పేపర్ 2కు హాజరుకావాలి. హిందీ, ఇంగ్లిష్తో సహా మొత్తం 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
గతంలో సీ-టెట్ ఏడేళ్ల వరకు వ్యాలిడిటీలో ఉండేది. ఆ తరు వాత అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం C-TET సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఎన్నిసార్లైనా పరీక్ష రాయడానికి అవకాశం ఉంది. వయోపరిమితి కూడా లేదు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడానికి అర్హులుగా పరిగణిస్తారు.
అర్హతలు: C-TET 2022కు దరఖాస్తు చేయాలంటే.. అభ్యర్థులు ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
6వ తరగతి నుంచి 9 తరగతుల వరకు బోధించాలనుకునే వారు డిగ్రీతో పాటు ప్రాథమిక విద్యలో రెండేళ్ల డిప్లొమా లేదా ఒక సంవత్సరం BEd లేదా నాలుగు సంవత్సరాల BElEdలో ఉత్తీర్ణులై ఉండాలి. KVS, NVS, సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో దరఖాస్తు చేయడానికి C-TET స్కోర్ ఉపయోగపడనుంది.
పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.https://ctet.nic.in/

B.tech vallu kuda rayacha allow unda
Andhra Pradesh state…Paper English / Telugu medium