మొబైల్ల్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. మీ ముందు ఒక గ్రంథాలయం ఉన్నట్టే లెక్క. ఖరగ్‌పూర్ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ పేరుతో ఈ పుస్లకాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఉపయోగపడే పుస్తకాలు పొందుపరిచింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు, రిఫరెన్సు పుస్తకాలన్నీ ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. అవసరమనుకుంటే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్ కాపీలను కూడా పొందొచ్చు.
ఈ లింక్ ను క్లిక్ చేయండి. మీరు అనుకున్న పుస్తకాన్ని చదవండి
https://ndl.iitkgp.ac.in
రిజిస్ట్రేషన్ సులభం
డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈ–మెయిల్ ఐడీ తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఈ వివరాలు ఫిల్ చేస్తే మీ ఈ–మెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తరువాత ఈ–మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ తో చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు.
కోటి పుస్తకాల లైబ్రరీ ఆన్లైన్లోనే
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS