కోల్‌కతాలోని ఈస్ట్రన్ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో 3,115 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.rrcrecruit.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.