తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్ TSTET 2023 ) నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఆగస్ట్ 16వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం పేపర్ 1..మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాల వెల్లడిస్తారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారికంగా టెట్ నోటిఫికేషన్ వివరాలపై ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాం. టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు tstet.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.

