తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్ కాలేజ్ మరియు రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ములుగులో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను www.tspsc.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ఈ అభ్యర్థులకు ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు రోజుల వారీ/సబ్జెక్టుల వారీ షెడ్యూల్ కోసం అధికారిక వెబ్ సైట్ ను (https://www.tspsc.gov.in/) సందర్శించాలని సూచించింది.
Hi