తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన ప్రైమరీ కీని టీఎస్పీఎస్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లోని లింక్ ద్వారా సమర్పించాలని సూచించారు అధికారులు. అభ్యర్థులు https://www.tspsc.gov.in/లింక్ ద్వారా తమ కీని చెక్ చేసుకోవచ్చు.
ఈ రోజు సాయంత్రం టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను కూడా విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో నుంచి లేదా ఈ లింక్ ద్వారా అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
