తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో విడుదల చేసిన 3 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Notification No. 23/2022: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్: ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ పరీక్షను మార్చి 15న, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
Notification No.24/2022: హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ను ఏప్రిల్ 4న నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

Notification No.31/2022: అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన రాత కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ను ఈ ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
So meny useful for total exam preparing aspirant