తెలంగాణలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు కొనసాగింది. ఈ రాతపరీక్షను ఈ నెల 26న నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం ఈ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేశారు అధికారులు.
టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు నమోదుచేసి హాల్ టికెట్ ను టీఎస్సీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్ లోడ్ డైరెక్ట్ లింక్–LINK