తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ (Notification No.31/2022) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నియామక పరీక్షను జూన్ 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, అదే రోజు 2:30 గంటల నుంచి 05:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో ఈ నియామక పరీక్ష ఉంటుందని కమిషన్ తెలిపింది.
ఈ పరీక్ష హాల్ టికెట్లను ఈ రోజు విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు ఈ లింక్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత ముందుగా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఇంకా అభ్యర్థులు ఈ లింక్ ద్వారా మాక్ టెస్ట్ ను రాయవచ్చని అధికారులు సూచించారు.