ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (లెక్చరర్స్), ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్ నియామకాలకు సంబంధించి మొత్తం 544 ఖాళీలకు గాను టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి అంటే జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 2న ముగియాల్సి ఉంది.
అయితే.. అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభాన్ని ఫిబ్రవరి 15కు వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నిర్వహణ కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.