Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. ఈ మిస్టేక్స్ చేస్తే ఓఎంఆర్ చెల్లదు.. గ్రూప్-1 పరీక్ష...

15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. ఈ మిస్టేక్స్ చేస్తే ఓఎంఆర్ చెల్లదు.. గ్రూప్-1 పరీక్ష రూల్స్ ఇవే..

తెలంగాణలో ఈ నెల 11న 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షను అత్యంత కట్టుదిట్టంగా.. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు చర్యలు చేపట్టింది. ఎగ్జామ్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అయితే.. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులెవరినీ అనుమతించేది లేదని తెలిపింది. OMR షీట్ నింపే సమయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థులకు సూచించింది. ఓఎంఆర్ షీట్ నింపే సమయంలో ఏమైనా తప్పులు చేస్తే కొత్త OMR పత్రం ఇవ్వబోమని స్పష్టం చేసింది.

వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో సక్రమంగా బబ్లింగ్ చేయాలని తెలిపింది. సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్/జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన పత్రాలు చెల్లవని తెలిపింది. అభ్యర్థులు హాల్టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకురావాలి. వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఇలా చేసిన వారిని కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని స్పష్టం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

1 COMMENT

  1. Peeki peeki sakkaga chesinattu ippudu idokkati 15 nimishalu late aite emaitadi emkadu exam rasina kooda vacchedi em ledu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!