గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ముఖ్య గమనిక. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్ లైన్లో నే ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుందని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 1 కోసం దాదాపు 4 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు ధరఖాస్తు ల సవరణకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గత నెల 19 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకటించిన విధంగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న జరగనుంది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి .