గ్రూప్ 3 (TSPSC GROUP 3) పోస్టుల సంఖ్య మరింత పెరిగింది. గ్రూప్ 3 పరిధిలోకి వచ్చే పోస్టులను పెంచుతున్నట్లు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ విభాగంలో 13 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటితో గ్రూప్3 లో ఉన్న పోస్టుల సంఖ్య పెరిగినట్లు ప్రకటించింది. దీంతో తొలి నోటిఫికేషన్లో ఉన్న మొత్తం 1365 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య.. 1388కి చేరింది. ఇప్పటికే అప్లై చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు కూడా అర్హులవుతారని టీఎస్పీఎస్సీ పేర్కోంది.

