రాష్ట్రంలో గ్రూప్ 1 తర్వాత అత్యంత ప్రాధాన్యమైన సర్వీస్ గ్రూప్ 2. కీలకమైన పోస్టుల రిక్రూట్మెంట్ సర్వీస్ కావటంతో గ్రూప్ వన్ స్థాయిలోనే గ్రూప్ 2కు భారీగా పోటీ ఉంటుంది. సిలబస్ కూడా దాదాపు కామన్‌గా ఉండటంతో గ్రూప్ 1 కు ప్రిపేరయ్యే వారందరూ గ్రూప్ 2 పరీక్ష అటెంప్ట్ చేస్తారు.
ఎనీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్2 కు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో నాలుగు పేపర్లు 600 మార్కులకుంటాయి. 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
గ్రూప్ 2లో ఏమేం పోస్టులుంటాయి..
మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–3 (మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్), అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్), సబ్ రిజిస్ర్టార్(రిజిస్ర్టేషన్), ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ (పంచాయత్ రాజ్), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‍స్పెక్టర్ (ఎక్సైజ్ డిపార్ట్మెంట్), డిప్యూటీ తహశీల్దార్ (ల్యాండ్ అడ్మినిస్ర్టేషన్), అసిస్టెంట్ రిజిస్ర్టార్ (కోఆపరేటివ్ సొసైటీస్), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–I (ఎండోమెంట్స్), అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (లేబర్ డిపార్ట్‌మెంట్), అసిస్టెంట్ డెవలప్‍మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రెటేరియట్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్‌మెంట్) వంటివి ఎగ్జిక్యూటివ్ (గెజిటెడ్) పోస్టులను భర్తీ చేస్తారు. వీటికి ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్‍లో అసిస్టెంట్ డెవలప్‍మెంట్ ఆఫీసర్ జాబ్ కు టెక్స్‌టైల్ లేదా హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారూ అర్హులు. లా డిపార్ట్‌మెంట్‍లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు లా లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.

గ్రూప్ 2 ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది.. ఎన్ని మార్కులు
ఎగ్జామ్ ప్యాటర్న్
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు | సమయం (గం) |
పేపర్–1 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ | 150 | 2.30 |
పేపర్–2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ | 150 | 2.30 |
పేపర్–3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ | 150 | 2.30 |
పేపర్–4 | తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ | 150 | 2.30 |
ఇంటర్వ్యూ – 75
మొత్తం 675
Super information