తెలంగాణాలో ఇంటర్మీడియేట్ పరీక్షల షెడ్యూల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఒకటి రెండ్రోజుల్లో విద్యాశాఖ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్ష తేదీలపై జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రభావం పడే చాన్స్ ఉన్నందున మరోసారి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మార్చే ఆలోచనలో పడింది ఇంటర్ బోర్డు.
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటగా అయితే ఏప్రిల్ 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష కారణంగా ఇదివరకే ఏప్రిల్ 20న ప్రారంభయ్యే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మార్చిన సంగతి తెలిసిందే.. కాగా జేఈఈ మెయిన్ షెడ్యూల్ కారణంగా మరోసారి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మార్చే యోచనలో ఇంటర్ బోర్డు ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మళ్లీ ఛేంజ్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS