HomeLATESTగ్రూప్-2 సిలబస్ లో తాజాగా చేసిన మార్పులివే.. కొత్త సిలబస్ PDF

గ్రూప్-2 సిలబస్ లో తాజాగా చేసిన మార్పులివే.. కొత్త సిలబస్ PDF

ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 భారీ ఖాళీలతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 16 దరఖాస్తుకు ఆఖరి తేదీ. అయితే.. గ్రూప్​2 నియామక పరీక్షకు సంబంధించిన సిలబస్ లో పలు మార్పులు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం నాలుగు పేపర్లకు గాను.. రెండు పేపర్ల కు సంబందించిన సిలబస్​లో మార్పులు చేసింది. పేపర్​2లో కొద్ది పాటు మార్పులు జరగగా.. పేపర్3లో చాలా మార్పులు చేశారు అధికారులు. అయితే.. పేపర్​ 1, 4లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.

పేపర్​ 2, సెక్షన్​–2: ఈ విభాగంలో కొత్తగా భారత రాజ్యాంగం: సవరణ విధానాలు మరియు సవరణ చట్టాలు. ఎలక్టరోల్​ మెకానిజం– ఎలక్టరోల్​ చట్టాలు మరియు పార్టీ ఫిరాయింపు చట్టం. భారతదేశంలో న్యాయ వ్యవస్థ– న్యాయ సమీక్ష, సుప్రీంకోర్ట్​ మరియు హైకోర్టులు. ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యేక ప్రోవిజన్లు, జాతీయ మహిళ, మైనారిటీ మరియు మానవ హక్కుల కమిషన్లు, జాతీయ సమగ్రత సమస్యలు మరియు సవాళ్లు, తిరుగుబాట్లు, అంతర్గత సెక్యూరిటీ, అంతరాష్ట్ర వివాదాలు.

పేపర్​ 2, సెక్షన్​–3: ఇందులో కొత్తగా భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం మరియు మహిళలు. సామాజిక సమస్యల్లో ట్రాన్స్​జండర్ ప్రాబ్లమ్స్​. సామాజిక ఉద్యమాలు అనే అంశంలో పౌర హక్కుల ఉద్యమాలు. తెలంగాణ సొసైటీ లో తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాలు మరియు సమస్యలు, కష్టాల్లో శిల్పకారులు, సేవా సంఘాలు అంశాలను చేర్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

పేపర్​ 3, సెక్షన్​–1: ఈ విభాగంలో డెమోగ్రఫీ (జనాభా శాస్త్రం): భారతదేశ జనాభా లక్షణాలు– జనాభా పరిమాణం మరియు వృద్ధిరేటు–డెమోగ్రపిక్​ డివిడెండ్​–రంగాల వారిగా జనాభా – భారతదేశ జనాభా విధానాలు. జాతీయ ఆదాయం విభాగంలో జాతీయ ఆదాయ భాగాలు– ఆదాయంను లెక్కించే పద్ధతులు–భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు మరియు వాటి ట్రెండ్స్​–రంగాల వారిగా విభజన–తలసరి ఆదాయం.

ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు: వ్యవసాయం మరియు సంబంధిత రంగాలు, జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం సహకారం, పంటల విధానం–వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదన–హరితవిప్లవం, నీటిపారుదల, వ్యవసాయ ఫైనాన్స్​, మార్కెటింగ్​, వ్యవసాయ ధరలు, వ్యవసాయ సబ్సిడీలు, ఆహార భద్రత, వ్యవసాయ లేబర్​ సంబంధిత రంగా పర్​ఫార్మెన్స్​ మరియు వృద్ధి అంశాలను కొత్తగా చేర్చారు.

పరిశ్రమ మరియు సేవా రంగం: భారతదేశంలో పరిశ్రమల వృద్ధి మరియు నిర్మాణం, జాతీయ ఆదాయానికి పరిశ్రమలు, సేవల రంగాల సహకారం, పారిశ్రామిక విధానాలు, భారీ తరహా పరిశ్రమలు, ఎంఎస్​ఎంఈలు, ఇండస్ట్రియల్​ఫైనాన్స్​, జాతీయ ఆదాయానికి సేవల రంగం కాంట్రిబ్యుషన్​, సేవారంగం ప్రాముఖ్యత, సేవల రంగం ఉప రంగాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, భారతదేశ వాణిజ్యం అంశాలను కొత్తగా చేర్చారు.

ప్లానింగ్​, నీతిఆయోగ్​ మరియు పబ్లిక్​ ఫైనాన్స్​: పంచవర్ష ప్రణాళికల వైఫల్యాలు, భారతదేశ బడ్జెట్, బడ్జెట్​లో లోటు భావనలు, ఎఫ్​ఆర్​బీఎం, తాజా యూనియన్​ బడ్జెట్​, పబ్లిక్​ రెవెన్యూ, పబ్లిక్​ వ్యయం, పబ్లిక్​ అప్పులు, ఫైనాన్స్​ కమిషన్లు భాగాలు చేర్చారు.

పేపర్​ 3, సెక్షన్​–2: ఇందులో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధి: స్టేట్​ ఫైనాన్స్​ (థార్​ కమిషన్)– 2014 నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్థి మరియు అభివృద్ధి రంగాల వారిగా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం.

జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి: జనాభా పరిమాణం, వృద్ధి రేటు– తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క జనాభా లక్షణాలు, జనాభా యొక్క వయసు నిర్మాణం, జనాభా డివిడెండ్​.

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు: వ్యవసాయం ప్రాధాన్యత, వ్యవసాయ వృద్ధిరేటులోని ట్రెండ్స్​ జీఎస్​డీపీ/జీఎస్​వీఏ కి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కాంట్రిబ్యూషన్​, భూమి వినియోగం, భూ హోల్డింగ్​ విధానం, పంటల విధానం, నీటిపారుదల సంబంధిత రంగాల వృద్ధి మరియు అభివృద్ధి వ్యవసాయ విధానాలు మరియు కార్యక్రమాలు.

పరిశ్రమ మరియు సేవాల రంగాలు: జీఎస్​డీపీ/జీఎస్​వీఏకి పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్​ పారిశ్రామిక విధానాలు–జీఎస్​డీపీ/జీఎస్​వీఏకి సేవల రంగం కాంట్రిబ్యూషన్​ సామాజిక మరియు ఆర్థిక మౌలిక సదుపాయాలు.

రాష్ట్ర ఫైనాన్ష్​లు, బడ్జెట్​ మరియు సంక్షేమ పాలసీలు: రాష్ట్ర రెవెన్యూ, వ్యయం మరియు అప్పు– రాష్ట్ర బడ్జెట్​లు– రాష్ట్రం యొక్క సంక్షేమ పాలసీలు.

పేపర్​3, సెక్షన్​–3: ఇందులో అభివృద్ధి మరియు అండర్​ డెవెలప్​మెంట్​ లక్షణాలు, ఆర్థిక వృద్ధి కొలమానాలు మరియు అభివృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, మానవ అభివృద్ధి నివేదికలు. సామాజిక మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలు.

పేదరికం మరియు నిరుద్యోగిత: ఆదాయ అసమానతలు, నిరుద్యోగిత భావనలు, సంక్షేమ ప్రోగ్రామ్స్​, ప్రాంతీయ అసమానతలు.

పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి: పర్యావరణ భావనలు–పర్యావరణ రక్షణ, కాలుష్యం రకాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ ప్రభావాలు, భారతదేశ పర్యావరణ పాలసీలు

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!