టీఎస్పీఎస్సీ (TSPSC) గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన రెండు విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టులు (25), గెజిటెడ్ పోస్టుల (32) ఖాళీలకు ఎగ్జామ్ తేదీలను విడుదల చేసింది. నాన్ గెజిటెడ్ పోస్టులకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మే 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. పరీక్షకు వారం ముందు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. గెజిటెడ్ విభాగంలోని మొత్తం 32 పోస్టులకు ఏప్రిల్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
నాన్ గెజిటెడ్ పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) – 7, టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) – 5, టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) – 8, ల్యాబ్ అసిస్టెంట్ – 1, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 4 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
గెజిటెడ్ ఖాళీలు: అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ – 1, అసిస్టెంట్ కెమిస్ట్ – 4, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ – 6, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ – 16, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ – 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.