తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16వ తేదీన నిర్వహించాల్సిన ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా.. సాధ్యమైనంత త్వరగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ లింక్ ద్వారా సీబీఆర్టీ మాక్ ఎగ్జామ్ ను రాయవచ్చని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
Idi kuda ammu kondi ra meeku dabbulu kaavali kada anukune vaallakosam I kojja govt