ఫలితాలు ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్సైట్ https://tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్ ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు.
CLICK HERE FOR INTER 1st YEAR RESULTS
CLICK HERE FOR INTER 2nd YEAR RESULTS
CLICK HERE FOR INTER 1st YEAR VOCATIONAL
CLICK HERE FOR INTER 2nd YEAR VOCATIONAL
మే 9న ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు సాయంత్రం నుంచి విద్యార్థులు మార్కుల మెమోలు కలర్ ప్రింట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ప్రకటించారు.
ఇంటర్ ఫలితాల విడుదలకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 9 వ తేదీన (రేపు ఉదయం 11 గంటలకు) ఇంటర్ ఫలితాలు విడుదల చేయనుంది. నాంపల్లి లోని ఇంటర్ బోర్డు ఆఫీస్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయం ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరందరూ ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రిజల్ట్స్ వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి ఫలితాల్లో ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఇంటర్ రిజల్ట్స్ అందించాలని ఇంటర్ బోర్డు కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అందుకే ఫలితాల వెల్లడికి కొంత ఎక్కువ సమయం తీసుకున్నట్లు చెబుతోంది.
TS INTER RESULTS 2023 DIRECT LINK
ఇంటర్ ఫలితాలు వెలువడగానే అఫిషియల్ వెబ్సైట్ http://tsbie.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రిజల్ట్ వెంటనే తెలుసుకునేందుకు ఫలితాల డైరెక్ట్ లింక్ మెరుపులు.కామ్‌లో అందుబాటులో ఉంది.