తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ కు సంబంధించిన ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల పేపర్లకు సంబంధించిన ప్రైమరీ కీని రేపు.. అంటే ఈ నెల 15వ తేదీ ఉదయం నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యర్థులు ప్రతీ ప్రశ్నలకు వేర్వేరుగా అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

అభ్యర్థులు తమ లాగిన అకౌంట్ల ద్వారా అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్లో ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను పీడీఎఫ్, jpeg ఫార్మాట్ లో సబ్మిట్ చేయాలన్నారు.