తెలంగాణలో ఎస్ఐ ((SI), ఏఎస్ఐ (ASI) పోస్టుల తుది ఎంపిక ఫలితాలు వెలువడ్డాయి. కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) తుది ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది. రేపు ఉదయం వారి వివరాలను వెబ్ సైట్లో ఉంచుతామని పేర్కొంది. దీంతో రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయిందని వెల్లడించింది. TSLPRB 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి 554 ఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీసి పది రోజుల్లోనే సెలెక్షన్ లెటర్లను అభ్యర్థులకు పంపించనుంది. ఆగస్టు రెండోవారంలోగా పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్ల విభాగాలకు సెలెక్షన్ లిస్ట్ పంపించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి..



6th class