తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు (TS Police Jobs) సంబంధించిన తుది రాత పరీక్షలు ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించారు. మొత్తం 1,09,663 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 1,08,055 మంది హాజరయ్యారు.
దీంతో 98.53శాతం హాజరు నమోదైనట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా తొమ్మిది జిల్లాల్లోని 183 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు.

హైదరాబాద్ సహా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష కొనసాగింది. 6,801 మంది అభ్యర్థులకు గాను.. 6,088 మంది పరీక్ష రాయగా.. 89.52శాతం హాజరు నమోదైనట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
త్వరలోనే పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని అందుబాటులో ఉంచనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్, HIP కోచింగ్ సంస్థ వారు అందించిన కీ పేపర్ అభ్యర్థుల కోసం అందిస్తున్నాం.