తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 కు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల కేటాయింపునకు సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హత కల్పించేందుకు ఈ ఎగ్జామ్ ను నిర్వహించున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహించనుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే రిలీజ్ చేసింది. యూనివర్సిటీల్లో అసిస్టెండ్ ప్రొఫెసర్లు, కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు ఎలిజిబులిటీ పరీక్షగా సెట్ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సెట్ లేదా పీహెచ్డీ తప్పనిసరి అర్హతగా ఉంటుంది.
తెలంగాణ వరుసగా రిలీజవుతున్న ఉద్యోగ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలంగాణ సెట్ కీలకం కానుంది. తెలంగాణలో 2019లో చివరిసారిగా ఈ పరీక్ష నిర్వహించారు. మూడేళ్ళుగా ఈ పరీక్ష మళ్లీ నిర్వహించలేదు. డిసెంబర్ 30వ తేదీకి అప్లికేషన్ల గడువు ముగిసింది. లేట్ ఫీతో ఫిబ్రవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది.

టీఎస్ సెట్ కు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి అధికారులు ప్రారంభించారు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు, ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న వారు టీఎస్ సెట్ కు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.