Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSనవంబర్ లో టెట్​.. ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ

నవంబర్ లో టెట్​.. ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET)కు నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్​కు మూడు నెలలు ఇవ్వనున్నారు. అనంతరం వచ్చేఏడాది జనవరిలో ఆన్​లైన్​ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్​ ముగిసిన తర్వాత మరో డీఎస్సీ నోటిఫికేషన్​ వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే టెట్​, డీఎస్సీ షెడ్యూలు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్​సీ నిర్వహించింది. ఆన్​లైన్​లో పరీక్షలు పూర్తయ్యాయి. ప్రిలిమినరీ కీ విడుదలైంది. త్వరలోనే ఫైనల్ కీతోపాటు జనరల్​ ర్యాంకింగ్​ లిస్ట్ ను విడుదల చేసేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఇటీవల విడుదల చేసిన జాబ్​ క్యాలెండర్​ ప్రకారం మరో సారి టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ–2025 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించనున్నారు. 5 వేల పోస్టులతో తదుపరి డీఎస్సీ వేస్తామని ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు కొత్త టీచర్లను నియమించాలని, డీఎస్సీ–2025 ద్వారా ఈ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!