కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) మహబూబ్‌నగర్ మరియు వరంగల్‌లో తాత్కాలిక ఉద్యోగాలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్), ఆఫీస్ అసిస్టెంట్ (అకౌంట్స్), ఆఫీస్ స్టాఫ్ క్లర్క్ వర్క్ (గోడౌన్) తదితర పోస్టులున్నాయి. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు.
మహబూబ్‌నగర్:
- ఉద్యోగాలు: ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్/జనరల్)
- అర్హత: కనీసం 50% మార్కులతో డిగ్రీ/బీకాం/బీఎస్సీ (అగ్రికల్చర్)
- వయస్సు: 35 ఏళ్లు (01.10.2024 నాటికి)
- వేతనం: ఫీల్డ్ స్టాఫ్ రూ.37,000, ఆఫీస్ స్టాఫ్ రూ.25,500
- ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 5, 6 తేదీలు
వరంగల్:
- ఉద్యోగాలు: ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్/అకౌంట్స్), క్లర్క్ (గోడౌన్)
- అర్హత: కనీసం 50% మార్కులతో డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం
- వేతనం: ఫీల్డ్ స్టాఫ్ కు రూ.37,000, ఇతర పోస్టులకు రూ.25,500
- ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 16
Hello sir good jobs vacancies