తెలంగాణలో దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన ఇంటర్ ఎగ్జామ్స్ బుధవారంతో ముగిశాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. పరీక్షలు మగియడంతో పేపర్ మూల్యాంకనంపై అధికారులు ఫోకస్ పెట్టారు. వాల్యుయేషన్ ను ఇప్పటికే ప్రారంభించగా.. సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది ఇంటర్ బోర్డ్. దీంతో పాటు వాల్యుయేషన్, టేబులేషన్ లో తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టింది. ఏప్రిల్ నెలాఖరులోగా వాల్యుయేషన్ ను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. అనంతరం మే ఫస్ట్ వీక్ లో రిజిల్ట్స్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో మొదలైన ఇంటర్ పేపర్ వాల్యుయేషన్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS