తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫలితాలను విడుదల చేస్తారు.
మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 4,88,448 మంది ఫస్ట్ ఇయర్, 5,08,523 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
నోట్: 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేసిన వెంటనే రిజల్ట్ లింక్ అప్ డేట్ అవుతుంది.