తెలంగాణ గురుకులాల్లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI-RB) ఈ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1276 PGT పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల 24వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ చేసిన అనంతరం అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా treirb.telangana.gov.in నమోదు చేసుకోవాలి.
పీజీటీ పోస్టుల్లోనూ మహిళలకే ఎక్కువ అవకాశాలున్నాయి. మొత్తం 1276 పోస్టులలో 966 పోస్టులు మహిళల కోటాలో ఉన్నాయి. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఈ పరీక్షా విధానం, సిలబస్, డిటైల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ అందిస్తున్నాం.
DETAILED NOTIFICATION
PGT SYLLABUS
EXAM PATTERN
