తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇటీవల భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను (Telangana Job Notifications) విడుదల చేసిన విషయం తెలిసిందే. అసిస్టెంట్, ఎగ్జామినర్, సిస్టమ్ అసిస్టెంట్, ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది హైకోర్టు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
-అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మార్చి 31న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో హైకోర్టు పేర్కొంది. ఈ పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించనుంది.
-ఎగ్జామినర్ పోస్టలకు సంబంధించిన నియామక పరీక్షను మార్చి 31న మధ్యాహ్నం 12.30-02.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
-సిస్టమ్ అసిస్టెంట్ నియామక పరీక్షను మార్చి 31న సాయంత్రం 04.00-05.30 వరకు నిర్వహించనుంది.
-ఇంకా ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియర్, కంప్యూటర్ ఆపరేటర్ నియామక పరీక్షను ఏప్రిల్ 1న ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు హైకోర్టు ప్రకటనలో పేర్కొంది.
-ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 23వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

తెలంగాణ హైకోర్టు ఇటీవల భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేయగా.. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 50, అసిస్టెంట్ పోస్టులు 10, ఎగ్జామినర్ పోస్టులు 17, సిస్టమ్ అసిస్టెంట్-45, అప్పర్ డివిజన్ స్టెనో-2, అసిస్టెంట్ లైబ్రేరియన్-2, కంప్యూటర్ ఆపరేటర్-20, ట్రాన్స్‌లేటర్-10, కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి-20 ఖాళీలు ఉన్నాయి.