తెలంగాణలో ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 472 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రోడ్లు మరియు భవనాల శాఖలో ఈ ఖాళీలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో ఇంజనీర్ జాబ్స్ నుంచి స్వీపర్ జాబ్స్ వరకు మొత్తం 21 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.