HomeLATESTతెలంగాణ డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ 2025 షెడ్యూలు.. పూర్తి వివరాలు

తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ 2025 షెడ్యూలు.. పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) డిగ్రీ కోర్సుల్లో (2025-26 విద్యాసంవత్సరం) అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీస్‌ తెలంగాణ (DOST) ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. BA, B.Sc, B.Com, BBA, BBM, BCA వంటి కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించారు.

దరఖాస్తు ప్రక్రియ:

  • ఫేజ్–1 రిజిస్ట్రేషన్: మే 3 నుండి మే 21 వరకు (రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు)
  • వెబ్‌ ఆప్షన్లు (ఫేజ్–1): మే 10 నుండి మే 22
  • ప్రత్యేక కేటగిరీల ధృవపత్రాల పరిశీలన: మే 21, 22 (PH/CAP/NCC/క్రీడలు/ఇతరాలు)
  • ఫేజ్–1 సీట్ల కేటాయింపు: మే 29
  • ఆన్‌లైన్ సీటు ధృవీకరణ: మే 30 నుండి జూన్ 6 వరకు

ఫేజ్–2 మరియు ఫేజ్–3 :

  • ఫేజ్–2 రిజిస్ట్రేషన్: జూన్ 3 – జూన్ 11 (రూ. 400 ఫీజు)
  • వెబ్ ఆప్షన్లు: జూన్ 3 – జూన్ 12
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 9
  • సీట్ల కేటాయింపు: జూన్ 13
  • సీటు ధృవీకరణ: జూన్ 13 – జూన్ 18
  • ఫేజ్–3 రిజిస్ట్రేషన్: జూన్ 13 – జూన్ 19
  • వెబ్ ఆప్షన్లు: జూన్ 13 – జూన్ 19
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 18
  • సీట్ల కేటాయింపు: జూన్ 23
  • ఆన్‌లైన్ ధృవీకరణ: జూన్ 23 – జూన్ 28

ఇతర ముఖ్య తేదీలు:

  • కళాశాలలకు రిపోర్టింగ్ (మూడు దశల్లో ధృవీకరించినవారు): జూన్ 24 – జూన్ 28
  • స్టూడెంట్ల ఒరియంటేషన్ కార్యక్రమం: జూన్ 29
  • క్లాసులు ప్రారంభం (సెమిస్టర్–1): జూన్ 30

గమనిక: ఫేజ్–1లో రెండు కంటే ఎక్కువ యూనివర్సిటీల కోర్సులకు దరఖాస్తు చేసిన వారికి రూ.200 మాత్రమే. ఫేజ్–2, 3 దరఖాస్తులకు రూ.400 ఫీజు ఉండనుంది. దరఖాస్తు విధానం, సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!