గ్రూప్ 4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పోస్టులకు 1:3నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది టీఎస్పీఎస్పీ. దీనికి సంబంధించిన జాబితా టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో జాబితాను అందుబాటులో ఉంచారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 1:3నిష్పత్తిలో జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను సిద్దంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రలో 8,039 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా గతేడాది జులై 1న పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఫలితాలను ప్రకటించారు.
ఈ ఫలితాల్లో మొత్తం 7,26,837 మంది అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆయా పోస్టులు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన త్వాత ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. వికలాంగుల కోటాలోని పోస్టులకు 1:5నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం త్వరలోనే గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించనున్నారు.