రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్నికాలేజీలు, స్కూళ్లకు గురు, శుక్రవారాలు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఈరోజు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసిన యూనివర్సిటీలు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి హైదరాబాద్‌తో పాటు మరో 22 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రెండు రోజులు స్కూళ్లు కాలేజీలకు సెలవులు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS