తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ 15 రోజుల్లో మూడో నోటిఫికేషన్ జారీ చేసింది. 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈనె 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. గత వారం 2,050 స్టాఫ్ నర్సుల పోస్టులకు మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3,967 పోస్టులు భర్తీ అవుతాయి.
మొత్తం పోస్టులు 633
- మొత్తం 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు
- వీటిలో 446 పోస్టులు ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో
- 185 పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో
- 2 పోస్టులు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో.
విద్యార్హతలు
- వీటిలో 95% పోస్టులు స్థానిక అభ్యర్థులకే కేటాయించనున్నారు. మిగిలిన 5% పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు.
- అభ్యర్థులు డీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అంతేకాకుండా, దరఖాస్తు చేసేటప్పుడు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు నమోదు చేసుకొని ఉండటం తప్పనిసరి.
వెయిటేజీ మార్కులు
- రాత పరీక్షకు 80 మార్కులు. మిగతా మార్కులు వెయిటేజ్ కింద ఉంటాయి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి 20 పాయింట్లు వెయిటేజ్ ఇస్తారు.
- గిరిజన ప్రాంతాల్లో కనీసం 6 నెలలు పనిచేసిన వారికి 2.5 పాయింట్లు కేటాయిస్తారు.
- గిరిజనేతర ప్రాంతాల్లో 6 నెలల సర్వీసుకు 2 పాయింట్లు వెయిటేజ్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
- దరఖాస్తు ప్రారంభం: అభ్యర్థులు అక్టోబర్ 5 నుండి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎడిట్ అవకాశం: దరఖాస్తులో పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23-24 మధ్య ఎడిట్ చేసే అవకాశం కల్పించారు.
- పరీక్ష తేదీ: నవంబర్ 30న రాత పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) రూపంలో, ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది.
వయోపరిమితి
- అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు, ఎన్సీసీ మరియు ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 3 సంవత్సరాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
జోన్ల వారీగా ఖాళీలు
జోన్ 1 ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు… : 79 పోస్టులు
జోన్ 2 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. : 53 పోస్టులు
జోన్ 3 కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. : 86 పోస్టులు
జోన్ 4 కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. : 98 పోస్టులు
జోన్ 5 సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. : 73 పోస్టులు
జోన్ 6 మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్..: 154 పోస్టులు
జోన్ 7 పాలమూరు, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్: 88 పోస్టులు
పరీక్షా కేంద్రాలు
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
- హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తు వెబ్‌సైట్
అభ్యర్థులు www.mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు.