Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSరైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్​

రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్​

భారతీయ రైల్వే వివిధ విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

ఖాళీలు: మొత్తం 7,951 పోస్టుల్లో కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్: 17(ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే), జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 జనవరి 2025 నాటికి 18 నుంచి -36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.

సెలెక్షన్ ప్రాసెస్​ ​: స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: మ్యాథ్స్‌ (30 ప్రశ్నలు- 30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), జనరల్ సైన్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలకు 90 నిమిషాల సమయం ఉంటుంది.

స్టేజ్‌-2: జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), ఫిజిక్స్ అండ్‌ కెమిస్ట్రీ (15 ప్రశ్నలు- 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ (10 ప్రశ్నలు – 10 మార్కులు) ఉంటాయి. టెక్నికల్ ఎబిలిటీస్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). మొత్తం 150 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం కేటాయించారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లకు రూ.250 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.rrbsecunderabad.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!