ఇండియన్ నేవీ 741 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టుతో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు.
పోస్టులు: మొత్తం 741 పోస్టుల్లో ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్ వర్క్‌షాప్)- 1, ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ)- 10, ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్)- 18, సైంటిఫిక్ అసిస్టెంట్- 4, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్)- 2, ఫైర్‌మ్యాన్- 444, ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 58, ట్రేడ్స్‌మ్యాన్ మేట్- 161, పెస్ట్ కంట్రోల్ వర్కర్- 18, కుక్- 9, ఎంటీఎస్ (మినిస్టీరియల్)- 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్), సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు 18- నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 18- నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 2 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.295 ఉంటుంది. పూర్తి వివరాలకు www.incet.cbt-exam.in వెబ్సైట్లో సంప్రదించాలి.