తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గత డిసెంబర్ 30న 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీ కోసం అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రోజు ప్రకటించింది.

ఆగస్టు 8న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. OMR టెస్ట్ కు బదులుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు. మొత్తం 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు 40,100ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.