నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 11న కరీంనగర్ సిటీలో భారీ జాబ్మేళా జరుగనుంది. కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణమండపం ఆవరణలో ఉచిత మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన అభ్యర్థులు దాదాపు 4 వేల మందికి ఈ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
విప్రో, జెన్ ప్యాక్, టాటా సర్వీసెస్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఇండిగో ఎయిర్ లైన్స్, గూగుల్ పే, రిలయన్స్ జియో కంపెనీలతోపాటు దాదాపు 100 పైగా ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నాయి. ట్రాన్స్ జెండర్స్ కు కూడా ఇందులో అవకాశాలను కల్పించనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో జాబ్ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది. 11వ తేదీ మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుంది. నిరుద్యోగులకు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్ఎస్ఐలు మహేష్(9652169877), తిరుపతి(6301955823) నంబర్లకు ఫోన్ చేయాలని కమిషనర్ సూచించారు.
నేడు అలంపూర్లో మెగా జాబ్ మేళా
