ఇటీవల ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తూ నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భారీ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉద్ధీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 80 కంపెనీలతో ‘‘మెగా జాబ్ మేళా’’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12న నకిరేకల్ (Nakrekal) పట్టణంలోని హైస్కూల్ లో మెగా జాబ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 80కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని వెల్లడించారు. ఈ కంపెనీల్లో మొత్తం 8 వేలకు పైగా ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ, యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళా ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు. చెవిటి, మూగ, దివ్యాంగులకు సైతం అవకాశాలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్హతలు:
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ తదితర విద్యార్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9985858091, 7287894394, 95157 38729, 93980 69412 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

విభాగాలు:
ఈ జాబ్ మేళాలో ఐటీ, మెడికల్, ఈకామర్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, హెటల్స్, ఇండస్ట్రీస్, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
వేతనాలు:
ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.