ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్యే మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీ ఫిషరీస్ సర్వీసులో ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 13లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 4
అర్హత : బీఎఫ్ ఎస్సీ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 01-07-2024 నాటికి 18ఏళ్ల నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ. 45,830 నుంచి 1,30,580వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 370 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ250గా ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 23,2024
చివరి తేదీ : మే 13, 2024