ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టులు:
మెడికల్ ఆఫీసర్- 3,
సైంటిస్ట్ ఇంజనీర్ – 10,
టెక్నికల్ అసిస్టెంట్- 28,
సైంటిఫిక్ అసిస్టెంట్- 1,
టెక్నీషియన్-B (ఫిట్టర్)- 22,
టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)- 12,
టెక్నీషియన్-B (AC మరియు రిఫ్రిజిరేషన్)- 1,
టెక్నీషియన్-B- (వెల్డర్) 2,
టెక్నీషియన్-B- (మెషినిస్ట్) 1,
టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)- 3,
టెక్నీషియన్-B- (టర్నర్) 1,
టెక్నీషియన్-B- (గ్రైండర్) 1,
డ్రాఫ్ట్స్‌మన్-B- (మెకానికల్)- 9,
డ్రాఫ్ట్స్‌మన్-బి- (సివిల్)-4,
అసిస్టెంట్ (రాజ భాష)- 5
అర్హత: పోస్టులను అనుసరించి టెన్త్, ఐటీఐ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు రూ. 21,700 నుంచి రూ. 2,08,700 వరకు జీతం చెల్లిస్తారు.
నెలకు రూ.2 లక్షల జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS