నిరుద్యోగులకు పోస్టల్ శాఖ అధిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం మరియు 7,082 ఏబీపీఎం పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 12 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని పేర్కొంది పోస్టల్ శాఖ.

విద్యార్హత: టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్ లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.