ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రతీ సంవత్సరం ‘రీజినల్ రూరల్ బ్యాంకు (RRB)ల్లో ఖాళీల భర్తీకి నియామక పరీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ఏడాది 2023కు సంబంధించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. మొత్తం ఖాళీల్లో క్లర్క్, పీఓ, ఆఫీసర్స్ స్కేల్ II, III లెవల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే.. జూన్ 1న ప్రారంభించారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్: https://www.ibps.in/
విద్యార్హతలు:
పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అభ్యర్థుల ఎంపిక:
ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు/ అప్లికేషన్ ఎడిట్: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు
ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్: ఆగస్టు, 2023
ప్రిలిమ్స్ ఫలితాలు: సెప్టెంబర్, 2023
మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్: సెప్టెంబర్, 2023
మెయిల్స్ రిజల్ట్స్: అక్టోబర్ 2023
ఇంటర్వ్యూలు: అక్టోబర్/నవంబర్, 2023
ప్రొవిజనల్ అలాట్మెంట్: జనవరి, 2024
Excellent ?