HomeLATESTగ్రూప్​ 2 గ్రూప్​ 3కి భారీ పోటీ.. ఎన్ని అప్లికేషన్లంటే..

గ్రూప్​ 2 గ్రూప్​ 3కి భారీ పోటీ.. ఎన్ని అప్లికేషన్లంటే..

టీఎస్​పీఎస్​సీ (TSPSC) నిర్వహిస్తున్న గ్రూప్​ 2 (GROUP 2 ) పోస్టులకు ఈసారి భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు నమోదయ్యాయి. ఎల్లుండి సాయంత్రంతో (ఈనెల 16తో) అప్లికేషన్ల గడువు ముగియనుంది. మంగళవారం సాయంత్రం వరకు అప్లికేషన్ల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటిపోయింది. గ్రూప్ 2 కి దాఖలైన అప్లికేషన్ల సంఖ్య 4.63 లక్షలకు చేరినట్లు టీఎస్​పీఎస్​సీ వర్గాలు తెలిపాయి.

గ్రూప్​ 2తో పాటు గ్రూప్​ 3 పోస్టులకు అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్​ 3 పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు తుది గడువు ఉంది. మంగళవారం సాయంత్రం వరకు గ్రూప్​ 3 అప్లికేషన్ల సంఖ్య 3 లక్షల 76 వేలకు చేరిందని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. ఇప్పటికే గడువు ముగిసిన గ్రూప్​ 4 అప్లికేషన్ల సంఖ్య 9.60 లక్షలకు చేరటం తెలిసిందే.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!