గ్రూప్ 1 పరీక్షలో మెయిన్స్‌కు క్వాలిఫై కావాలంటే.. ఎన్ని మార్కులు రావాలి. కటాఫ్ మార్కు అందరికీ ఒకేలా ఉండదని, పోస్టులు కేటగిరీ వారీగా 50 మందిని ఎంపిక చేస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్‌కు సెలెక్టయ్యే జాబితాలో ఉండే ఛాన్స్ ఉందనే అనాలసిస్‌ను నిపుణులు తయారు చేశారు. ఈ అంచనా ప్రకారం ఎస్టీ కేటగిరీలో 40 నుంచి 45 మార్కులు వస్తే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. ఓపెన్ కేటగిరీలో 70 నుంచి 75 మార్కులు సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ఏయే కేటగిరీలో.. ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్‌కు క్వాలిఫై అవుతారనేది.. ఈ జాబితా ద్వారా ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.

మొత్తం 150 మార్కుల్లో.. ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్ రాసేందుకు ఛాన్స్ దొరుకుతుంది.. అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం.. ఈసారి పోస్టుల సంఖ్యను బట్టి.. 1:50 రేషియో ప్రకారం అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు ఎంపిక చేస్తారు. అంటే ఇప్పుడున్న 503 పోస్టుల ప్రకారం (1:50 నిష్పత్తి ప్రకారం) కేవలం 25150 మందిని మెయిన్స్‌కు అర్హులుగా ఎంపిక చేస్తారు. మల్టీ జోన్లు, రిజర్వేషన్లను బట్టి ఒక్కో పోస్టుకు 50 మందిని అర్హులుగా పరిగణిస్తారని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అందుకే ఆయా కేటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్యను బట్టి.. మీరు మెయిన్స్‌కు చేరుకుంటారా.. లేదా.. అనేది ఆధారపడి ఉంటుంది. అదెలాగో చూద్దాం
మల్టీ జోన్ వారీగా ఉన్న పోస్టులు, రిజర్వేషన్, ఈడబ్ల్యుఎస్, స్పోర్ట్ కోటా ను పరిగణనలోకి తీసుకుని ప్రిలిమ్స్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. అంటే.. జోన్ల వారీగా కూడా ఈ మార్పులు ఉంటాయి. మల్టీ జోన్ 1 లో 234 పోస్టులున్నాయి. అంటే మల్టీ జోన్ 1 లో మెయిన్స్‌కు ఎంపిక కావాలంటే కంపల్సరీగా మీరు.. ఈ మల్టీ జోన్లో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల్లో నుంచి టాప్ 11700 ర్యాంకుల్లో ఉండాల్సిందే. అప్పుడు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కీలకమవుతుంది.
ఉదాహరణకు.. ఈసారి మొత్తం 503 పోస్టుల్లో మల్టీ జోన్ వన్‌లో ఒకటే స్పోర్ట్ కోటా పోస్టు (ఎంపీడీవో) ఉంది. అంటే ఈ మల్టీ జోన్లో ఈ పోస్టుకు అప్లై చేసుకున్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల్లో నుంచి (ప్రిలిమ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారిని) 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
ఉదాహరణకు మల్టీ జోన్ 2 లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి బీసీ (డీ)లో విమెన్ కోటా ఒక్క పోస్టు మాత్రమే ఉంది. ఈ మల్టీ జోన్లో ఈ పోస్టులకు అప్లై చేసిన విమెన్ నుంచి ప్రిలిమ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన 50 మంది టాపర్లకు మెయిన్స్ రాసే అవకాశం దక్కుతుంది.
ఇదే తీరుగా మల్టీ జోన్లు, రిజర్వేషన్ల వారీగా ప్రకటించిన పోస్టులను బట్టి.. ఒక్కో పోస్టుకు మెయిన్స్‌లో తప్పనిసరిగా 50 మంది అభ్యర్థులు పోటీ పడేలా ఇక్కడ వడపోత జరుగుతుంది.
ఓపెన్ కోటా కేటగిరీలో మాత్రం భారీగా పోటీ ఉండే అవకాశముంది. మొత్తం 503 పోస్టులో 129 ఓపెన్ జనరల్ కోటా పోస్టులున్నాయి. రిజర్వేషన్లకు అతీతంగా వీటికి ఎవరైనా పోటీ పడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా మార్కులు సాధించేందుకు పోటీ పడాలి. టాప్‌లో 6450 మంది ర్యాంకుల్లో ఉంటే మెయిన్స్ కు ఎంపికైనట్లే. అంటే ఇప్పుడున్న పోటీ అంచనా ప్రకారం మొత్తం 150 మార్కుల్లో 120కి మించి మార్కులు సాధించాల్సి ఉంటుంది.
TRS party
Result please
My results